కల్దుర్కి ఎమ్మార్వో అరాచకాలు భరించలేమంటున్న ట్రాక్టర్ యజమానులు
బోధన్ మండలం కల్దుర్కి – జూలై 8 ( ప్రతినిధి):
బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో ట్రాక్టర్ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మార్వో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ట్రాక్టర్ యజమానులపై అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు.
వారికిచ్చిన వివరాల ప్రకారం, మంజీరా ప్రాంతం నుండి బోధన్ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వెనుక తట్టుకోట్ ప్రాంతానికి మట్టి (బ్లాక్) తరలించడానికి ఒక్క ట్రాక్టర్‌కు యజమానులు తీసే ధర రూ. 3,500గా ఉన్నప్పటికీ, కల్దుర్కి ఎమ్మార్వో మరియు అతని బృందం తాము కేవలం రూ. 3,000 మాత్రమే చెల్లించి మిగతా మొత్తం దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇక పైపుల కోసం రూ. 1,000 చొప్పున 32 ట్రాక్టర్ యజమానుల నుండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా మొరం తరలించనివారి నుంచీ రూ. 1,000 వసూలు చేస్తున్నారంటూ పలువురు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తాలు ఎందుకు చెల్లించాలో అడిగిన యజమానుల ట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేయించి, బోధన్ ఎమ్మార్వో కార్యాలయంలో ఫైన్ వేయించడం, తహసీల్దార్ కార్యాలయాల్లో అడ్డుకోవడం జరుగుతోందని వారు తెలిపారు.
“మేము కష్టపడుతున్నాం… కానీ మా శ్రమను లాక్కుంటున్నారు. ప్రభుత్వమే మా కోసం ఉన్నదా? లేక ఎమ్మార్వో టీం కోసమా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు నిర్దోషులైన ట్రాక్టర్ యజమానులపై జరుగుతున్న దాడులకు బ్రేక్ వేయాలని, జిల్లా కలెక్టర్ హస్తక్షేపం చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమానులు కోరుతున్నారు. కల్దుర్కి ఎమ్మార్వో స్థానిక అధికారులతో కలిసి రెచ్చిపోతున్నారని ఆరోపించారు.