టోల్ ప్లాజా కార్మికులను అందరిని కొనసాగించాలి, కనీస వేతనం ఇవ్వాలి -CITU
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ,ఫేర్వెల్ కంపెనీ టోల్ మేనేజర్ బొమ్మెనసురేష్, కార్మికులతో గారితో, చర్చలు నిర్వహించడం కార్మికులందరినీ కొనసాగించాలి కనీస వేతన ఇవ్వాలి , ఈ సందర్భంగా *CITU జిల్లా కార్యదర్శి బొమ్మెన.సురేష్ * మాట్లాడుతూ పిప్పరువాడ, నేరడిగొండా,గంజాల్ టోల్ ప్లాజా కార్మికులు గత 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తు కార్మికులకు *పాత కంపెనీ రిద్ది సిద్ది* ఒప్పంద ప్రకారము 24000 నుంచి 29 వేల రూపాయల జీతం ఇస్తున్నారు, పాత జీతాన్ని కొనసాగించాలని కంపెనీ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఫిబ్రవరి 14 నుంచి టోల్ ప్లాజాను టేకవర్ చేసుకోవడం జరిగింది. ఫేర్వెల్ టోల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ కార్మికులు గత 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారిని తీసుకోకుండా, ఒక్కరికి కార్మికునికి 6000 నుంచి 8 వేల రూపాయలు నష్టపోతున్నారు. లేబర్ కార్మిక చట్టాల ప్రకారము, ఒక కార్మికుల 60 సంవత్సరాల వరకు కొనసాగించాలి కానీ, కంపెనీ వాళ్ళు 54 సంవత్సరాలకే వయసు ఉన్న వారిని తీసుకోవడం జరిగింది, కాబట్టి 60 సంవత్సరాల వరకు తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉన్న పాత జీతాన్ని కొనసాగిస్తూ, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,PF, ESI, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి
రిద్ది సిద్ది కంపెనీ గంజాల్ టోల్ ప్లాజా ను నిర్వహిస్తున్న కంపెనీ వాళ్లు హైయెస్ట్ జీతం 24 నుండి 29 వేల రూపాయలు ఇస్తున్నారు, నూతనంగా వచ్చిన కంపెనీ సెంటర్ మినిమం వేజెస్, ప్రకారము జీతాలు ఒప్పందం మేరకు కార్మికులు పనిచేయాలి, కార్మికులు జీతాలు నష్టపోతున్నాము అని
ఒప్పుకోక పోవడంతో పేపర్స్ లో నూతనంగా ఉద్యోగాలు తీసుకుంటామని నోటిఫికేషను ఇవ్వడం కార్మికుల కొట్టగొట్టడమే, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు, లేబర్ కోర్టు చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, కార్మికులకు గతం లో ఇచ్చే జీతం కన్నా 25% శాతం జీతం పెంచి ఇవ్వాలి, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించే టోల్ ప్లాజా నేషనల్ హైవే NHM టోల్ ప్లాజా గత 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ఇస్తున్న జీతనికి 25/. శాతం పెంచిన వేతనం ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షలు కల్పించాలి. ఇప్పుడు పని చేస్తున్న కార్మికులందరినీ యధావిధిగా కొనసాగించాలి.
ఈ కార్యక్రమంల *గంజాల్ యూనియన్ అధ్యక్షులు M.రమేష్, నాయకులు రాజేశ్వర్, నవీన్,శ్రావణ్ రాజకుమార్, నేరడిగొండా అధ్యక్షులు లక్షణ్, పిప్పరువాడ,సంతోష్*,తదితరులు పాల్గొన్నారు