నేడే మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం
గువహతి వేదికగా సెప్టెంబర్ 30న మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ – శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ 34 రోజుల పాటు సాగి నవంబర్ 2న ముగుస్తుంది. ఈ టోర్నీలో 8 జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 2న జరుగుతాయి. పాకిస్థాన్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. మొదటి మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య గువహతిలో జరుగుతుంది