🐐 మేషం
మంచి ఆలోచనలతో ముందుకుసాగి అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మీ కీర్తి మరియు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు దక్కే అవకాశం ఉంది. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే మరింత శ్రేయస్సు కలుగుతుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
పట్టుదలతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరతారు. అనవసరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగించవచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిదిగా ఉంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
శ్రమ ఫలిస్తుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యమే. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్ర, ఆహారాలు తగినంతగా తీసుకోవాలి. శ్రీవిష్ణు ఆరాధన శ్రేయస్సును అందిస్తుంది.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తల వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శన మంచి ఫలితాలను ఇస్తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి మరింత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్సును అందిస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్యా
కీలక విషయాల్లో విజయాలు సాధిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించడం మంచిదిగా ఉంటుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయాలు సాధించవచ్చు. మానసిక దృఢత్వం ఎక్కువగా ఉంటుంది. సౌభాగ్యాన్ని పొందే అవకాశం ఉంది. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం శ్రేయస్సును అందిస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ప్రణాళికతో ముందుకుసాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
పెద్దల సూచనలు అనుసరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ధన, ధాన్య లాభాలు దక్కే అవకాశం ఉంది. మనఃసాంతి లభిస్తుంది. హనుమాన్ ఆరాధన శ్రేయస్సును అందిస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభవార్తలు మీ ఇంటిలో ఆనందాన్ని నింపుతాయి. శని ధ్యానం చేయడం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరమైన సాయం లభిస్తుంది. శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ శ్రేయస్సును అందిస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొందరి ప్రవర్తన ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. గోసేవ చేయడం శ్రేయస్సును కలిగిస్తుంది.