🐐 మేషం
(23-12-2024)
స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యాలను పూర్తి చేస్తారు. పెద్దల సూచనలతో పనులు వేగంగా పూర్తి అవుతాయి. కుటుంబ అభివృద్ధికి మీ కృషి ఫలిస్తుంది. శివారాధన శుభప్రదం.
🐂 వృషభం
(23-12-2024)
చేపట్టే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం సాధ్యమవుతుంది. ఎవరినీ అతిగా నమ్మకండి. ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. శ్రీరామ నామాన్ని జపించండి.
💑 మిధునం
(23-12-2024)
తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగండి. అవసరమైన సహాయం అందుతుంది. ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోండి. లక్ష్మీ స్తుతి చేయండి.
🦀 కర్కాటకం
(23-12-2024)
అద్భుతమైన కాలం. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థికంగా బలపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
🦁 సింహం
(23-12-2024)
తోటి వారి సహాయంతో పనులు పూర్తి అవుతాయి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంతో ప్రేమగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలరు. ఆదిత్య హృదయం చదవండి.
💃 కన్య
(23-12-2024)
మీ రంగంలో శుభ ఫలితాలు అందుతాయి. స్వల్ప ప్రయత్నంతో విజయాన్ని పొందగలరు. ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. బంధుప్రీతి ఉంటుంది. శివారాధన చేయడం మంచిది.
⚖ తుల
(23-12-2024)
ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్న లక్ష్యం చేరేవరకు ప్రయత్నం ఆపకండి. ఖర్చులు అదుపులో ఉంచండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
🦂 వృశ్చికం
(23-12-2024)
వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు తగ్గించండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
🏹 ధనుస్సు
(23-12-2024)
శుభకాలం. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటే మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించండి.
🐊 మకరం
(23-12-2024)
ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణుమూర్తి ధ్యానించండి.
🏺 కుంభం
(23-12-2024)
ముందుచూపుతో వ్యవహరిస్తే విజయవంతమవుతారు. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణం మంచిది.
🦈 మీనం
(23-12-2024)
మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాపకింద నీరులా ఇబ్బందులు కలిగించే వారు ఉంటారు. ఆత్మీయుల సలహాలు తీసుకుంటే ఉపకారం జరుగుతుంది. గణపతిని ధ్యానించండి.
: లగచర్లను రేవంత్ లంకలా మార్చారు: మాజీ మంత్రి పొన్నాల