నేడు ‘నిసార్’ ప్రయోగం
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సంయుక్తంగా చేపట్టిన ‘నిసార్’ (NISAR) మిషన్ ప్రయోగం బుధవారం జరగనుంది. ఈ ప్రయోగం సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్16 (GSLV-F16) రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ప్రయోగం ప్రారంభమైన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనున్నారని అధికారులు తెలిపారు