నేటి వార్తలు(25.07.2025)

నేటి వార్తలు(25.07.2025)

✒నేటి వార్తలు(25.07.2025)

✳నేటి ప్రత్యేకత:
▪ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం (World Drowning Prevention Day)
▪ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ జూలై 25, 1978 న ఇంగ్లాండ్ లోని ఓల్డ్ హామ్ జనరల్ హాస్పిటల్ లో జన్మించింది.

✳అంతర్జాతీయ వార్తలు:
▪అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమల నిర్మించడం భారతీయ ఉద్యోగులను నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
▪థాయిలాండ్, కాంబోడియా దేశాలు సరిహద్దులలో పరస్పరం దాడులు చేసుకున్న సంఘటనలో నిన్న థాయిలాండ్ లో 11 మంది మృతిచెందగా 28 మంది గాయాల పాలయ్యారు.
▪రష్యాలో నిన్న 49 మంది తో వెళ్తున్న అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ ఎన్ 24 విమానం చైనా సరిహద్దులలో కూలిపోయిన సంఘటనలో మొత్తం 49 మంది దుర్మరణం పాలయ్యారు.
▪జన్మతః పౌరసత్వం కల్పించే విధానాన్ని రద్దు చేయడంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీళ్ళ కోర్టు నిన్న తీర్పు వెలువరించింది.
▪ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యం పెంపొందించేందుకు 32.2 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, అత్యాధునిక క్షిపణులను అందించేందుకు అమెరికా విదేశాంగశాఖ అంగీకరించింది.

✳జాతీయ వార్తలు:
▪బ్రిటన్ లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ లు నిన్న రెండు దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశారు.
▪భారత భీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ గా అజయ్ సేథ్ ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది.
▪రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ కి చెందిన కంపెనీలు రూ 3,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయని ఆరోపణలపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నిన్న పలుచోట్ల సోదాలు నిర్వహించింది.
▪ముంబై రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు నిన్న స్టే విధించింది.
▪ప్రయాణికుల వాహనాలలో ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను నిన్న సుప్రీంకోర్టు తిరస్కరించింది.
▪పర్యాటకం, టాక్సీ సేవలు, బీమా, సాంప్రదాయేతర ఇంధన రంగాలలో సహకార స్ఫూర్తిని విస్తరించేందుకు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలోని కమిటీ రూపొందించిన జాతీయ సహకార విధానాన్ని నిన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
▪దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పిసి) సమావేశం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నేటి నుంచి రెండు రోజులపాటు జరగనుంది.

✳రాష్ట్ర వార్తలు:
▪తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటనపై జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ అందించిన నివేదికను నిన్న మంత్రిమండలి ఆమోదించింది.
▪విజయవాడ, విశాఖ పట్టణం నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని నిన్న సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.
▪ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి నేడు మరింతగా బలపడుతుండడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది
▪బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజులపాటు సింగపూర్ లో పర్యటించనున్నారు.
▪ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు ఒకటో తేదీన కొత్తగా 1.09 లక్షల మందికి స్పౌజ్ పింఛన్లు అందించనున్నట్లు సెర్ఫ్ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు.
▪విద్య హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలలో భర్తీ చేస్తున్న 25% సీట్లకు ఫీజులను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

✳క్రీడా వార్తలు:
▪ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో జరుగుతున్న నాల్గవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 358 పరుగులకు ఆల్ ఔట్ అయింది.
▪జార్జియా లోని బాటుమి లో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో భారత క్రీడాకారిణి కోనేరు హంపి ఫైనల్స్ లో ప్రవేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment