నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం

*నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం*
దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. *అక్టోబర్ 15న కలాం జయంతి*

దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపారు. 1931లో జన్మించిన కలాం.. రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు. పదవీ కాలం పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోకుండా.. తనకు ఇష్టమైన బోధన పట్ల మక్కువ చూపారు. ఐఐఎం షిల్లాంగ్‌లో అధ్యాపకుడిగా చేరారు. 2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ.. కుప్పకూలిపోయారు.

*కలాం*
కలాం జీవితం మొత్తం విశ్రాంతి లేకుండా పని చేశారు. తొలి విజయం సాధించాక ఆగిపోకండి.. మొదటిసారి గెలిచి, రెండోసారి ఓడితే.. తొలి విజయం అదృష్టవశాత్తూ వచ్చిందంటారు.. అని యువతకు కలాం సందేశాన్నిచ్చారు. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడని కలాం చెప్పిన సూక్తి యువతకు ఆదర్శం. మనిషికి కష్టాలు ఎంతో అవసరం… కష్టాలు వచ్చినప్పుడే.. విజయాన్ని ఆస్వాదించగలం అని ఆయన జీవిత సారాన్ని బోధించారు.
*భారత్ మాతాకీ జై*

Leave a Comment