నేడు తెలంగాణలో స్కూళ్లకు సెలవు
తెలంగాణ : కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఒకరోజు పాటు మూసివేయనున్నాయి. దీంతో పాఠశాల విద్యార్థులకు సెలవు లభించింది.