శీర్షిక పకృతి మాత
కరువు కాటకాలు సంభవించకుండా వ్యవసాయాధార బ్రతుకులను చల్లగా చూడాలని
పకృతి దేవతను పూలతో పూజించే గొప్ప పండుగ
తెలంగాణ చరిత్రను సాంస్కృతి సాంప్రదాయాలను
పాటల రూపంలో ప్రపంచ నలుమూలల తెలియజేసే పండుగ
తంగేడు గునుగు బంతి ముత్యాల పువ్వులు… తీరోక్క పువ్వులతో తీరోక్క రంగులతో బతుకమ్మను ముస్తాబుచేసి ఆడపడుచులు అందరూ
పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఆడిపాడే గొప్ప పండుగ
బతుకుతూ బతుకునివ్వు అనే అర్థం చెప్పే పండుగ
ప్రకృతే పరమాత్మ అని నమ్మి పూలలోనే
ఆ పరాశక్తిని నిలిపి కొలిచే అద్భుతమైన పండుగ
ప్రకృతిని పూజించే పండగే బతుకమ్మ పండగ ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన పండుగని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ ఆడపడుచులందరికి బతుకమ్మ శుభాకాంక్షలు
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218