శీర్షిక నిషాపర్వం
మద్యపాన మాయలాడిని పెనిమిటి మనువాడిన తరువాత మగువ బ్రతుకు అగమైపోయింది
మతులను పోగొట్టె పానీయాన్ని అక్కున చేర్చుకొన్న
తరువాత మానవత్వం మంట కలసిపోయింది
మనుజుడు మద్యపాన జిత్తులమారి వగలాడిని
మనువాడి వావి వరసలు మరచిపోయి మహిళలపై అత్యాచారాలు చేస్తు మహిళల బ్రతుకు అగమం చేస్తున్నాడు
కల్లు కాంపౌండ్ లో మద్యపాన వగలాడితో సరసమాడి కూలి నాలి చేసిన మొత్తం సొమ్ము
దానికి తగలబెట్టి అర్ధరాత్రో అపరాత్రో ఊగుతూ తూలుతూ ఇంటికి వచ్చి మహిళల బ్రతుకు అగమం చేస్తున్నాడు
మందు వదిలి ముందుకు సాగు మిత్రమా
చిదిమేసిన జీవితాలను బాగు చేసుకో నేస్తమా
రచన మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
శీర్షిక నిషాపర్వం
Published On: July 27, 2025 5:12 pm