శీర్షిక బోనాలు తెచ్చాము ఓయమ్మా
కోటికోటి దండాలు మా పెద్దమ్మ తల్లి
శతకోటి దండాలు మా పోచమ్మ తల్లి
బోనాలు తెచ్చాము ఓయమ్మా
మము సల్లంగా దీవించు మాయమ్మ
కరువు కాటకాలు లేకుండా మమ్ములను
కాపాడవమ్మా
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మమ్ములను
కాపాడవమ్మా
అహంకార అంధకారంతో విర్రవీగే దుష్టులకు
జ్ఞానజ్యోతిని హృదిలో వెలిగించవమ్మా
మా అంతరంగం నిండా నీవే కోలువై ఉన్నవమ్మా
మా ధైర్యదీపికవు నీవమ్మ
శక్తిరూపమే నీవమ్మ
ఈ శ్రావణ మాస బోనాల పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు
రచన మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218