తిరుమలలో వైసీపీ నాయకుల అక్రమ వసూలుపై టాక్సీ కార్మికుడు మురళీకృష్ణ నాయుడు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారికి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టిక్కర్ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని నాయుడు ఆరోపించారు. జిల్లా ఎస్పీ బాధితులకు న్యాయం చేస్తామని, అక్రమ వసూలుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తిరుమలలో వైసీపీ నాయకుల అక్రమ వసూలుపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. స్టిక్కర్ల పేరుతో భారీ అవినీతికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు భూమన అభినయ రెడ్డిపై టాక్సీ కార్మికుడు మురళీకృష్ణ నాయుడు ఫిర్యాదు చేశారు.
: తిరుమలలో టాక్సీ స్టాండుల వద్ద స్టిక్కర్ల పేరుతో జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చేందుకు టాక్సీ కార్మికుడు మురళీకృష్ణ నాయుడు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారికి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, మాజీ ఎమ్మెల్యే కుమారుడు భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో టాక్సీ డ్రైవర్ల నుండి అక్రమంగా రూ. 10,500 వసూలు చేసి స్టిక్కర్లు మంజూరు చేశారని నాయుడు ఆరోపించారు. దీంతో పాటు వైట్ బోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తిప్పుతూ, ప్రైవేట్ టాక్సీ లను అణచివేస్తున్నారని తెలిపారు. స్పందించిన ఎస్పీ గారు, ఈ అవినీతి చర్యలను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.