ప్రజాబలం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలి —కేసీఆర్
త్వరలో జరగబోయే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల్లో మంచి ఆధరణ,అభిమానం,ప్రజాబలం,నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు ఉన్న వ్యక్తికే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కేసీఆర్ గారు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరు ఉంటే గెలుస్తారో క్షేత్ర స్థాయిలో ఒక సర్వే జరుగుతుందని ఆ సర్వేలో ఎవరికి మంచి పేరు ఉందో వారికే పార్టీ అవకాశం ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది అంటూ BRS లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.అధికారం ఉంటే ఎవరైనా గెలవచ్చు కాని ప్రతిపక్ష పార్టీలో గెలవాలంటే ప్రజల్లో మంచి పేరు ఉన్న నేతలు, సుపరిచితమైన బలమైన నేతలు ఉంటేనే గెలుస్తామనే భావనలో BRS అధిష్టానం ఉన్నట్లు సమాచారం..