- యంగ్ డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దూరం” షార్ట్ ఫిల్మ్
- ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా పోస్టర్ లాంచ్
- సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి ప్రత్యేక ఆకర్షణగా
“దూరం” షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లాంచ్ చేశారు. తరుణ్ తేజ్ దర్శకత్వంలో మణి రూప్ రెడ్డి, సుప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంచనాలు పెంచుతున్న ఈ ప్రాజెక్టులో సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి పని చేస్తున్నారు. డైరెక్టర్ తరుణ్ తేజ్ తన FTIH ఇన్స్టిట్యూట్ కోసం ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించినట్లు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 21, 2024:
యంగ్ డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న “దూరం” షార్ట్ ఫిల్మ్ 1స్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లాంచ్ చేశారు. మణి రూప్ రెడ్డి, సుప్రియ జంటగా నటిస్తుండగా, అమ్మినేని భాస్కర్ ఈ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు.
పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, “ఇలాంటి యువ దర్శకులు మరియు కొత్త ఆలోచనలతో కూడిన కంటెంట్ ఇండస్ట్రీకి అవసరం. AI టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించి అద్భుతమైన కథను రూపొందించడం గొప్ప విశేషం” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా దర్శకుడు తరుణ్ తేజ్ మాట్లాడుతూ, “ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుత తరం అనుభవాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నా FTIH ఇన్స్టిట్యూట్ కి సబ్మిట్ చేయబోతున్నాను. మా టీమ్ మరియు కుటుంబ సభ్యుల అండదండలు లేకుండా ఇది సాధ్యం కాలేదు” అని అభిప్రాయపడ్డారు.
సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి మాట్లాడుతూ, “షార్ట్ ఫిల్మ్‌లు నా కెరియర్ ప్రారంభానికి పెద్ద మద్దతు. తరుణ్ తేజ్ లాంటి కొత్త టాలెంట్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను,” అని తెలిపారు.
కళాకారులు మరియు సాంకేతిక బృందం:
- ఎడిటింగ్: ఐకాన్ వేణు
- సంగీతం: లలిత్, సచిత్
- పోస్టర్ డిజైన్: గోవర్ధన్ సాత్విక్
- సౌండ్ ఎఫెక్ట్స్: వెంకట్
- పి.ర్: RJ నరేశ్