ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?
ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది టీడీపీ. మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఆ పార్టీలో అధ్యక్షుడి తర్వాత అంత పెద్ద పోస్ట్. చిన్నబాబు ఆ పదవిని వేరే వాళ్లకు ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది. కొందరు నందమూరి నటసింహం పేరును తెరమీదకు తెస్తుంటే.. మరికొందరు నారా వారి కోడలి పేరును ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ లోకేశ్ తర్వాత ఆ పోస్ట్‌లో కూర్చునేదెవరు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించబోతున్నారు?
ప్రాంతీయ పార్టీగా ఏర్పడి..ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జాతీయ పార్టీగా పేరు తెచ్చుకుంది టీడీపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. అయితే లోకేశ్ ఈ మధ్యే ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది.
కీలకమైన ఆ పదవిని ఎవరికి అప్పగిస్తారు?
ఒక పోస్ట్‌లో ఒక వ్యక్తి మూడు సార్లు ఉండొద్దనేది తన అభిప్రాయమన్న లోకేశ్..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను మరొక నేతకు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న ఆయన తన స్థానానికి రాజీనామా చేస్తే.. కీలకమైన ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఉంది. దీనిపై అటు టీడీపీలో..ఇటు ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను ఎవరికి ఇస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారన్న ఓ టాక్ నడుస్తోంది. బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి నెగ్గారు. ఈసారి ఆయనకు క్యాబినెట్‌లో కూడా బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు, సామాజికవర్గం పరంగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో..బాలయ్యను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం లేదంటున్నారు.
ఆయన సేవలను తెలుగు స్టేట్స్‌లో వాడుకోవాలనే ఉద్దేశ్యం..
అలాంటప్పుడు ఆయన సేవలను పార్టీ పటిష్టత కోసం వాడుకోవాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే బాలయ్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారని అంటున్నారు. బాలయ్య సినీ గ్లామర్ బాగా పెరిగిన నేపథ్యంలో ఆయన సేవలను రెండు తెలుగు స్టేట్స్‌లో వాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం ఉంటుందట