టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరా బత్తుల రాజశేఖర్
  • టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.
  • గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌.
  • ఉభయగోదావరి జిల్లాల నుండి పేరా బత్తుల రాజశేఖర్‌.

 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్‌ను బరిలో నిలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ తన అభ్యర్థుల పేర్లను ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్‌ను బరిలో నిలపాలని నిర్ణయించారు.

ఆళపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు నెల రోజుల క్రితమే ఖరారై, ప్రస్తుతం అధికారికంగా ప్రకటించబడింది. ఎన్నికలలో విజయం సాధించేందుకు ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారని సమాచారం. చంద్రబాబు ఈ సందర్భంగా, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో టీడీపీ తమ కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు బలంగా పనిచేస్తున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment