*భైంసా సి. డి. పి. వో. పోస్టుకు ఇంత డిమండా!*
*నేనంటే నేను అని రాజకీయ పైరవీలు*
*రెగ్యులర్ పోస్టు లేక పోవడం తో గాడి తప్పుతున్న వ్యవస్థ*
భైంసా జనవరి 07 మనోరంజని తెలుగు టైమ్స్
ఇంచార్జి అధికారుల మూలంగా కింది స్థాయి, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంచార్జి పదవి నాకంటే నాకు పోటి పడుతున్నారంటే వారి అంతర్యమేమిటో అర్థం కావడం లేదు.. గత సంవత్సర క్రితం నుండి భైంసా ఐ. సి. డి. ఎస్. కార్యాలయం లో ఇంచార్జి సి. డి. పి. వో. సూపర్ వైజర్ రాజశ్రీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు వేరే వారికి బాధ్యతలు ఇచ్చినప్పటికి పైరవీలు చేసి మరి ఇంచార్జి బాధ్యతను తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే గత మూడు రోజుల క్రితం జిల్లా అధికారులు సీడీపీఓ గా సరిత కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటికి ఆమె పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని కొందరి చే అధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిసింది.. ఎలాగైనా ఇంచార్జి సి. డి. పి వో. గా తానే కొనసాగాలని ఇప్పటి వరకు బాధ్యతల్లో ఉన్న సదరు అధికారి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వం ఇక్కడ రెగ్యులర్ సి. డి. పి. వో. ఇవ్వక అధికారులు ఇష్ట రీతిన వ్యవహారిస్తున్నారు. ఇంచార్జి సి. డి. పి. వో. గా ఉంటే ప్రభుత్వ అలవెన్సులు రావడం తో పాటు, మరింత లాభం చేకూరడం వల్లే ఈ పోస్టుకు నేనంటే నేనే అన్న విధంగా వ్యవహారిస్తున్నారు.. భైంసా, ముధోల్, ల లో సూపర్ వైజర్లే ఇంచార్జి సి. డి. పి. వో లు గా వ్యవహారిస్తున్నారని, దీంతో పాలన గాడి తప్పుందని ప్రజలు అంటున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి రెగ్యులర్ వాళ్లకు బాధ్యతలు అప్పజేప్పాలని కోరుతున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడే ఉన్న సిబ్బంది ని, సూపర్ వైజర్లను బదిలీ చేస్తే కొంత వ్యవస్థ బాగుపడుతుందన్న అభిప్రాయం సైతం ఉంది.