- ముత్యాలమ్మ మందిరంలో జరిన సంఘటనను ఖండించిన మెడిసెమ్మ రాజు.
- హిందూ దేవాలయాలకు ఎలాంటి హాని కలిగిస్తే నిషేధం.
- నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి హెచ్చరిక.
సికింద్రాబాద్ నగరంలోని ముత్యాలమ్మ మందిరంలో సలీం అనే వ్యక్తి చేసిన దుర్మార్గానికి నిరసనగా, మెడిసెమ్మ రాజు మాట్లాడుతూ, హిందూ దేవాలయాలకు హాని కలిగిస్తే, ఊరుకునేది లేదని హెచ్చరించారు. మేము ఆ వ్యక్తిని ఉరి తీసే వరకు పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్:
సికింద్రాబాద్ నగరంలో 14వ తేదీన ముత్యాలమ్మ మందిరంలో జరిగిన దుర్ఘటనను ఖండిస్తూ, మెడిసెమ్మ రాజు మాట్లాడుతూ, సలీం అనే వ్యక్తి అమ్మవారిని కాలితో తన్నడం అమానుషమని అన్నారు. అటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరి తీయాలని, హిందువులను, హిందూదేవాయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం సిగ్గు చెడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్మల్ మంచిర్యాల చౌరస్తాలోని శివాజీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆ వ్యక్తిని ఉరి తీసే వరకు నిరంతరంగా పోరాటం చేస్తామని, హిందూ దేవాలయాలకు ఏదైనా హాని తలపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సామనపల్లి రాఘవులు, గజవాడ కృపాల్, కటకం అశోక్, శిల్ప సంతోష్, శ్రీనివాస్, అయ్యప్ప శ్రీనివాస్, సురేందర్, డాక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.