కుమ్మర అనేపదం ఆయుద్దంగా మారాలి, కుమ్మర అనే పదం ఒక ఉద్యమంకావాలి…!

కుమ్మర కుల అభివృద్ధి
  • కుమ్మర కులం ప్రగతికి అవగాహనలో లోపం
  • కుటుంబ సర్వేలు, ప్రభుత్వ అవగాహన లోపాల కారణంగా కులం వెనుకబడింది
  • కుల అభివృద్ధికి సంకల్పం, “కుమ్మర” అనే పదాన్ని గర్వంగా అనుసరించాలి
  • సంఘ నాయకుల, రాజకీయ నాయకులపై అవగాహన కల్పించడమే కీలకం

కుమ్మర కులం వివిధ రంగాలలో వెనుకబడింది. గత ప్రభుత్వాలు చేసిన కుటుంబ సర్వేలు, అవగాహన లోపాలు, మరియు కుల నాయకుల వ్యతిరేక చట్టాలు ఇందుకు కారణం. “కుమ్మర” అనే పదాన్ని గర్వంగా ఉపయోగించి, కుల అభివృద్ధి కోసం సమాజంలో చైతన్యం సృష్టించాలి. దీని ద్వారా మన సంక్షేమం, ప్రగతి సాధించవచ్చని, తెలంగాణ కుమ్మర సంఘం కార్యదర్శి ఏనుగు తల యాదగిరి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో మన కుమ్మర కులం అనేక రంగాల్లో వెనుకబడిన కులంగా మారిపోయింది. ఇది ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, రాజకీయపరంగా మరియు సంక్షేమ పథకాల పరంగా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక కారణాల వల్ల మన కులం వెనుకబడిపోయింది, వాటిలో ముఖ్యమైనవి గత ప్రభుత్వాలు చేసిన అవగాహన లోపాలు, కులవ్యవస్థపై అవగాహన లేకపోవడం, అలాగే కొంతమంది కుల నాయకులు తప్పుదారి పట్టించడం.

ప్రస్తుత పరిస్థితి చూస్తే, ఇతర BC కులాల సంఖ్యా బలం పెరిగింది, కానీ మన కులం యొక్క సంఖ్యా బలం పెరిగినట్లయితే, మనకూ అన్ని రంగాలలో ప్రాధాన్యత లభించేది. కానీ మనం “కుమ్మర” అనే పదాన్ని గర్వంగా చెప్పుకోవడంలో సంకోచించటం, ఈ కులం అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది.

“కుమ్మర” అనే పదాన్ని గర్వంగా అంగీకరించడం, ఆ పేరు వాడటం, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, రాజకీయ నాయకత్వం మరియు ఇతర రంగాలలో ఉన్న వ్యక్తుల ద్వారా “కుమ్మర” అనే పేరు వ్యాపించాలి. ఈ విధంగా, మన సమాజంలో చైతన్యం సృష్టించడం, కుల అభివృద్ధికి కీలకంగా మారుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment