భారత విశ్వ విజేతగా మహిళ భారత జట్టు!

భారత విశ్వ విజేతగా మహిళ భారత జట్టు!

భారత విశ్వ విజేతగా మహిళ భారత జట్టు!

మనోరంజని ప్రతినిది 

హైదరాబాద్:ఫిబ్రవరి 02

భారత్ విశ్వ విజేతగా అవతరించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రి కాను చిత్తు చేసి విశ్వ విజేతగా ఆవిర్భవించింది.

తద్వారా వరుసగా రెండవ U-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలిం ది. ఈ లక్ష్యాన్ని టీమిండి యా 11.2 ఓవర్లలో 1 వికె ట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది…

ఈ మ్యాచ్ లో తెలంగాణ అమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ చాటింది. మొదట బౌలింగ్ లో మూడు వికెట్ల పడగొట్టిన ఈ తెలుగు తేజం ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. .

ప్రపంచకప్ విజయం తో టీమ్ ఇండియా కొత్త సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించింది. వరుసగా రెండో ప్రపంచకప్ విజయం తర్వాత అండర్-19 మహి ళల టీమ్ ఇండియాకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

2023లో షఫాలీ వర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా మొదటి అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పు డు మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ ని గెల్చుకుని భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు

Join WhatsApp

Join Now

Leave a Comment