గడిచిపోయిన ఆ జనరేషన్ జర్నలిస్టుల సంక్షేమం గాలికేనా…!!?

గడిచిపోయిన ఆ జనరేషన్ జర్నలిస్టుల సంక్షేమం గాలికేనా...!!?

గడిచిపోయిన ఆ జనరేషన్ జర్నలిస్టుల సంక్షేమం గాలికేనా…!!?

కలాల పరిశ్రమలో నడుస్తున్న శవాలుగా ఆ జర్నలిస్టులు…!!

శాశనరంగం బూటు కాళ్ళ క్రిందికి మీడియారంగం…!!

(Epuri Raja Ratnam)
M.A.,MJMC,(Ph.D)

జర్నలిస్టులు రోడ్డున పడితే…అక్కడి ప్రభుత్వం కూడా రోడ్డున పడినట్లేనని ప్రజాపాలన సాగిస్తున్న ప్రభుత్వం ఏదైనా గమనించుకోవాల్సిన విషయం ఇది.ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జర్నలిజం-జర్నలిస్టులకు కూడా నాలుగవ స్తంభంగా గుర్తింపు ఉంది.ఇక్కడ శాసన,పాలనా,న్యాయ రంగాలతో పాటు మీడియారంగం కూడా పైనున్న మూడు రంగాల తో కలిసి ఉంటేనే ప్రజాస్వామ్యంగా పరిగణించబడుతుంది.మనలో చాలామందికి తెలియని విషయ మేమంటే”ఈనాటిదా… చీకటితో…దీపానికి వైరం” అన్నట్లు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం కొందరి జర్నలిస్టుల పరిస్థితి తమ జీవితాలను మెరుగు పరచుకోలేక, నిత్యం వెలుగు కోసం పోరాడే బ్రతుకులయ్యాయి..

..మన జర్నలిస్టుల జీవితాలు. అలాగే కొందరు సీనియర్ జర్నలిస్టుల మనుగడ అగమ్యగోచరంగా మారింది.ఈ క్రమంలో కొందరు సీనియర్ జర్నలిస్టుల జీవన విధానం అలసిపోయిన పరుగుపందెంలా మారిపోయింది.అయినా అదిగో మరికొద్దిగా శక్తిని కూడగట్టుకొని పరిగెత్తు విజయం దక్కుతుంది అనేంత ఆశలు కల్పించే విధంగా అంతుచిక్కని ఆశలపరుగుతోనే కొందరు సీనియర్ జర్నలిస్టులు జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అవును…! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గడిచిపోయిన ఒకతరం జర్నలిస్టుల గురించి ఇప్పుడు…ఇక్కడ…తెలియజేయడం గురించే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.

గడిచిన 15-20ఏళ్లుగా జర్నలిజంలో పనిచేస్తున్న వారిలో, కొందరు సీనియర్ జర్నలిస్టులు ఏ విధంగాను వారి జీవితాలను మెరుగుపరచుకోలేక, కరిగిపోతున్న క్రొవ్వత్తుల్లా మిగిలిపోయారు.ఇక్కడ విలువలకు,నీతి-నిజాయితీలకు కట్టుబడి పనిచేసిన జర్నలిస్టుల గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది

తప్ప మీడియారంగాన్ని వ్యక్తిగత వ్యవహారాలకు, మీడియా పేరిట దోపిడీలకు పాల్పడిన వారి గురించి అస్సలు చెప్పడంలేదు. ఇలా కొన్నేళ్ళుగా జర్నలిజంలో ఉన్న జర్నలిస్టుల ‘తరం’ ఒకటి ప్రస్తుతం తన మనుగడ సాగించలేక నడి సంద్రంలో మ్యూనిగిపోతున్న నావ వలే ముగింపు దశలో ఉంది.అంటే ఒక జనరేషన్ జర్నలిస్టుల కాలం మారి, ఇప్పటికే కొత్త జనరేషన్ జర్నలిస్టులు మీడియా రంగంలోకి వచ్చి ఉన్నారు.

జర్నలిస్టులు లిఖించే ప్రతీ అక్షరం,వాక్యం ఏదైనా ఈ సమాజానికి వెలుగు పంచుతూ…నిత్యం సమాజాన్ని సంస్కరించుకునే కథనాలను జర్నలిస్టులు రాయడం జరుగుతుంది. ప్రజల సమస్యలు రాసే జర్నలిస్టులు తమకు ఎన్ని కష్టాలు ఉన్నా….ఇవి మా జర్నలిస్టుల సమస్యలు అని ఎవరికి చెప్పుకోలేని బాధాతప్త హృదయాలతో మన జర్నలిస్టులు ఉన్నారు.ఇక్కడ జర్నలిస్టుల సంక్షేమం చూసే ప్రభుత్వం మాది అని,రాజకీయ నాయకులు చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలు, వారి హామీలు ఎప్పటికీ నెరవేరని తెలిసినా….

ఒక జనరేషన్ జర్నలిస్టులు వెర్రిబాగులోళ్లుగా మిగిలిపోయారు.ఏ ప్రభుత్వం చేసింది ఏమీలేదని నిరాశవాదులుగా తమ సంక్షేమం ఇక ఎప్పటికీ నెరవేరదని ఎవరికివారు ఆశలు వదిలేశారు గడిచిన ఓ తరం జర్నలిస్టులు.తమ జీవిత చరమాంకంలో తమ కుటుంబాలను పోషించే శక్తిలేక,కనీస ఆదాయం లేక,ఆరోగ్యం క్షీణించి,జర్నలిజంలో ఉన్నన్ని రోజులు దర్జాగా, గౌరవ మర్యాదలతో బ్రతికిన ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు దిక్కులేక అన్నీ కోల్పోయి జీవించి ఉన్నప్పటికీ, దేనికి కాలు-చేయి ఆడని అనాధ శవాలుగా ఈ సమాజంలో సంచరిస్తున్నారు.ఇదేమిటి అని ఎవరైనా అనుకోవచ్చు.ఇక్కడ ఒక విషయం గమనించాలి. జర్నలిజం అనేది చాలా పవిత్రమైన వృత్తి.ఇది ఎప్పుడూ ప్రజలకు నిజమే చెప్పాలి.అందుకు ఏ లాభాపేక్ష లేనివారు, స్వార్ధం, సొంతలాభం చూసుకోని వారు, అవినీతి-అక్రమాలను నిలదీస్తూ ప్రశ్నించే వ్యక్తులు,మరిముఖ్యంగా అన్యాయాన్ని ఎదిరించి పోరాడి నిలబడి నిజాన్ని రాబట్టేవారు,సమాజం పట్ల బాధ్యత కలిగి, సమాజం పట్ల భద్రత కలిగి ఉండేవాడు నిజమైన జర్నలిస్ట్.తన జీవితం కరిగిపోతున్నా…జర్నలిజం కి కుటుంబాన్ని త్యాగం చేస్తున్న జర్నలిస్టులలో కొందరు ఇప్పుడు జీవంలేని దేహాలుగా మారి,పుట్టెడు వ్యాధులతో చిక్కి శల్యమై ఉన్నారు.ఇక ఉదయం మొదలయ్యే పరుగుల నడకతో,రాత్రి కునికిపాటుతో ఇంటికి చేరేవరకు మన జర్నలిస్టు లు చాలామంది తమ పత్రికలకు,న్యూస్ ఛానల్స్ కి ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు.

ఇటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం మాయ మాటలు చెప్పకుండా వారి సంక్షేమం చూడాలి.లేనిచో ఒక జనరేషన్ సీనియర్ జర్నలిస్టుల ఆవేదన ప్రశ్నించే శక్తులుగా మారే అవకాశం ఉంది.అచ్చు కాబడే అక్షరం అంకుశంగా మారక ముందే అన్నీ కోల్పోయిన జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి,కనీస సంక్షేమంతో నాటి జనరేషన్ జర్నలిస్టులను ప్రభుత్వం సంస్కరించుకోవాల్సిన బాధ్యత ఉందనేది గ్రహించాలి.ప్రస్తుతం ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఈ సారి ఇస్తుంది అనే నమ్మకం ఉన్నప్పటికీ,జర్నలిస్టులయితే ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలుపుకుంటుందా…?లేదా….?అనే అయోమయంలో ఉన్నారనేది మిలియన్ డాలర్ల సమస్య గానే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు గానీ,పదేళ్ళ క్రితం రెండుగా విడిపోయిన నాటి నుండిగానీ రెండు తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు ఏ ప్రభుత్వాలైనా ఏమి చేశాయి.గడిచిన 20 ఏళ్ళలో తెలుగు రాష్ట్రాలను పాలించిన ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు ఏమి చేశాయి…? జర్నలిస్టులకు ఇది చేసాం అని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయగలవా….?ఇలా ఒక జనరేషన్ జర్నలిస్టుల కాలం ముగిసింది.20 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం దిగిపోయే వరకు హడావుడి చేసింది.

జర్నలిస్టులకు ఆశలు చూపిందే గాని ఆకుపరిచి భోజనం పెట్టలేకపోయింది. ఏ ప్రభుత్వం అయినా వస్తు….వస్తూనే అందరికీ అన్నీ చేసేస్తామని చెప్పి వాటితో పాటు జర్నలిస్టుల కు పూర్తి సంక్షేమం ఇస్తామని మాయ మాటలు చెప్పడం తప్ప ఇక్కడ జర్నలిస్టుల సంక్షేమం ఎండమావిగానే మిగిలిపోతుంది.ఈ క్రమంలో మరో విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.2019లో ప్రపంచాన్ని కడగడలాడించిన కరోనాకాలంలో మరణించినటువంటి జర్నలిస్టుల సంఖ్యను ప్రభుత్వం కరెక్టుగా చెప్పలేకపోయింది.పోతే కరోనాతో చనిపోయినటువంటి జర్నలిస్టులకు ప్రకటించిన ఐదు లక్షలు నష్టపరిహారం ప్రకటనకే పరిమితమైంది

. ఇలా ప్రభుత్వం చేస్తున్న ఈ బూటకపు ప్రకటనలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.పైగా జర్నలిస్టుల సంక్షేమ పేరు చెబుతూ అక్రిడేషన్లకు ముడిపెట్టి ఎప్పుడు లేని విధంగా జర్నలిస్టుల అక్రిడేషన్లోనూ కోత వేయడం జరిగింది.ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులకు కలిగిన లాభం ఏమీలేదు,ఇకనైనా జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా తీరని కోరికగా మిగిలిపోతున్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అనే విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం మన ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది.

గడిచిన జనరేషన్ సీనియర్ జర్నలిస్టులు ఎంతోమంది అనారోగ్యాల పాలై జర్నలిజం వృత్తికి దూరమై, ఏ ఆధారం లేకుండా ప్రస్తుతం జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.ఈ విధమైన జర్నలిస్టులు ప్రభుత్వం నుండి కనీస సంక్షేమం కోరుకుంటున్నారు.ఏ ప్రభుత్వాలు అయినా సరే ఎంతోమందికి కొద్దో గొప్ప ఆసరా కల్పిస్తున్నాయి. జర్నలిజం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగో స్థంభంగా చెప్పుకోవడమే గానీ, కొంతమంది జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేదు, పనిచేసిన మీడియా సంస్థల్లోను జర్నలిస్టుల పరిస్థితి పనికిరానివాడు మనకెందుకు అని వదిలించుకోవటమే ముఖ్య అంశంగా మారింది

.ఇది అక్షర సత్యం.ఇకపోతే ప్రభుత్వం 10 సంవత్సరాల అనుభవం దాటినటువంటి జర్నలిస్టులను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.ఇక్కడ జర్నలిస్టులు అంటే వారికేమిలే….! అడ్డదిడ్డంగా బాగానే సంపాదించుకొని ఉంటారనేది కొంతమేరకు వాస్తవం.అయినప్పటికీ ఇది పూర్తిగా నమ్మాల్సిన విషయం ఏమీ కాదు.కానీ ఇలాంటి ఆలోచన కలిగిన వెంటనే….ఎవరైనా సరే జర్నలిజంలో నేటికీ విలువలతో పనిచేస్తునటువంటి జర్నలిస్టులు కూడా ఎంతోమంది ఉన్నారని తప్పక గుర్తించాల్సిన అవసరం ఉంది. అటువంటి వారిపై అవసరమైతే ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వాళ్ల పరిస్థితులను గమనించి ఏమీలేనటువంటి జర్నలిస్టులను ప్రభుత్వం కనీస పెన్షన్ అవకాశమైనా ఇవ్వాలి.

ఈ వృత్తిలో ఎన్నాళ్ళు కొనసాగి కనీసం ఇంటి స్థలం పొందనటు వంటి సీనియర్ జర్నలిస్టు లకు,అనారోగ్యం పాలై నేడు జర్నలిజంలో కొనసాగలేని స్థితిలో ఉండి అక్రిడేషన్ లేని జర్నలిస్టు లకు ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించే అవకాశం కూడా కల్పించాలి. అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులకు ఇంటి స్థలం అనేటువంటి అంశాన్ని బాగా పరిశీలించుకుని గడిచిపోయిన 24 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు లబ్ధిపొందిన జర్నలిస్టులు,అవకాశం పొందలేని జర్నలిస్టులు ఎవరు అనేటువంటి పరిశీలనను ప్రభుత్వం చేపట్టాలి.సీనియర్ జర్నలిస్టులు జీవన పోరాటానికి ప్రభుత్వం అండగా నిలవాలి.

జర్నలిస్టుల శ్రమదోపిడికి ఆయా మీడియా యాజమాన్యాలు కనీస బాధ్యత వహించాలి. ప్రభుత్వంపై ఆశ తప్ప మరే ఆశలో లేనటువంటి ఈ జర్నలిస్టులలో ప్రస్తుత జర్నలిస్టులతో పాటు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని గడిచిన జనరేషన్ సీనియర్ జర్నలిస్టులు కోరుకుంటున్నారు.

ఈపూరి రాజారత్నం
M.A.,MJMC(Ph.D)
సీనియర్ జర్నలిస్ట్
9390062078

Join WhatsApp

Join Now

Leave a Comment