బుద్ధుడి మార్గమే ఉన్నతమైన జీవనానికి దిక్సూచి

  • బుద్ధుడి మార్గం ప్రపంచానికి శాంతి అహింసాను బోధించింది.
  • గ్రంథ పఠన ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం.
  • యువకులను మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రోత్సహించడం.

 ముధోల్: బుద్ధుడి మార్గమే ఉన్నతమైన జీవనానికి దిక్సూచి అని బిఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గడ్పాలె తెలిపారు. మహాగావ్ గ్రామంలో జరిగిన గ్రంథ పఠన ముగింపు కార్యక్రమంలో, గౌతమ బుద్ధుడు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకు పూజలు చేశారు. యువకులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించి, విద్యపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు.

 M4 న్యూస్ ప్రతినిధి: ముధోల్:

బుద్ధుడి మార్గమే ఉన్నతమైన జీవనానికి దిక్సూచి అని భారతీయ బౌద్ధమహసభ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ గడ్పాలె అన్నారు. గురువారం బైంసా మండలంలోని మహాగావ్ గ్రామంలో నిర్వహించిన గ్రంథ పఠన ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో, గౌతమ బుద్ధుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు నిర్వహించారు.

అనంతరం, బుద్ధుడు బోధించిన ఆర్య అష్టాంగ మార్గం, నాలుగు ఆర్య సత్యాలు, పంచశీలాలు పాటించాలని బౌద్ధ ఉపాసకులు మరియు ఉపాసికలకు సూచించారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మరియు ప్రతి ఒక్కరు విద్యాధికులు కావాలని కోరారు. ఉన్నత విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని వివరించారు.

బుద్ధుడు బోధించిన మైత్రి, కరుణ, ముదిత భావాలను సమాజంలో పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కోరారు. అలాగే, ప్రతి గ్రామం నుండి సమతా సైనిక్ దళంలో కనీసం ఐదుగురు చేరాలని ప్రోత్సహించారు. ఆషాడ పౌర్ణమి నుండి అశ్విన్ పూర్ణిమ వరకు మూడు నెలలపాటు బుద్ధుడు మరియు అతని ధర్మం గ్రంథాన్ని పట్టణం చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఎస్ఐ కేంద్ర కమిటీ ఆర్గనైజర్ సంజయ్ బోధి, ఎస్ఎస్ డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ వాగ్మారే, బిఎస్ఐ సంస్కార్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్బారావు వాగ్మారే, కోశాధికారి భీమ్రావు వాగ్మారే, ఆర్గనైజర్ శంకర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శంకర్ చంద్రే, లక్ష్మణ్ చంద్రే, ఉపాసకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment