ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పెండపెల్లి గ్రామస్తులు

ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం

10 సంవత్సరాలు పాలకులు పట్టించుకోలేదు

పదవి చేపట్టిన నెలల్లోనే నిధుల మంజూరు అయ్యాయి

ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం
చేసిన పెండ్ పెల్లి గ్రామస్తులు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

పది సంవత్సరాలుగా మా సమస్యను గత పాలకులు పట్టించుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 10 నెలల కాలంలోనే మా గ్రామానికి కోటి రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు పెండ్ పెల్లి గ్రామస్తులు ధన్యవాదాలు చెప్పి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమానికి అతిథులుగా మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ వైస్ ఎంపీపీ నర్సారెడ్డి, సీనియర్ నాయకులు సోలంకే భీమ్రావ్,, నాయకులు పండిత్ రావ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పక్షాన్ని మెప్పించి నిధులు తీసుకురావడంలో సఫలీకృతులవుతున్నారన్నారు. పది నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేసిన ఘనత రామారావు పటేల్ దేఅన్నారు. ఎమ్మెల్యే తెచ్చిన అభివృద్ధి పనుల్ని తాము తెచ్చామని సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గీయులు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఏకచిత్రాధిపత్యంగా రాజ్యమేలిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అప్పుడు ఎందుకు నిధులు తేలేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి రామారావు పటేల్ కు అధికారం అప్పజేపితే అభివృద్ధి ని అడ్డుకునే విధంగా మాజీ ఎమ్మెల్యే వ్యవహారించడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు ఐదు సంవత్సరాలు పటేల్ కు అధికారం ఇచ్చారని పాలనకు అడ్డుకట్ట వేయడం మంచి పద్దతి కాదన్నారు. కార్యక్రమం లో మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్, సచిన్ నాయకులు సాయరెడ్డి, ప్రతాప్ సింగ్, చంద్రకాంత్ పటేల్, వెంకట్రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం

Join WhatsApp

Join Now

Leave a Comment