తండ్రి మృతితో అనాధలుగా ఇద్దరు చిన్నారులు
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 11
ముధోల్ మండలంలోని సరస్వతి నగర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. సంజీవ్ కుమార్ ఆగస్టు 10న రైలు ప్రమాదంలో మృతి చెందారు. మూడు సంవత్సరాల లోపే ఉన్న ఆ ఇద్దరు పసి పిల్లలు నాన్న ప్రేమకు, ఆప్యాయతకు శాశ్వతంగా దూరం అయ్యారు. సంజీవ్ కుమార్ రైలు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసి, వారి జీవితాన్ని తలకిందులు చేసింది. తండ్రి మరణంతో ఆ కుటుంబాన్ని పోషించే మార్గం లేకుండా పోయింది. తినడానికి తిండి కూడా లేని దయనీయ స్థితిలో తానూర్ మండలం మొగిలి గ్రామంలో బంధువుల ఇంట్లో వర్ష ఇద్దరు చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఈ చిన్న కుటుంబానికి ఆసరాగా నిలిచి, వారి జీవితాన్ని తిరిగి గాడిన పెట్టడానికి మీరు కూడా సహాయం చేయవచ్చు. దాతల సహాయం కోసం 7337526601 నంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు. మనస్ఫూర్తిగా వారికి సహాయం అందించి, ఆ కుటుంబాన్ని ఈ దుర్బర పరిస్థితి నుండి గట్టెక్కించడానికి చేయూతనిద్దాం