విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
హిందీ, మరాఠీ చిత్రాల ప్రముఖ నటి సంధ్యా శాంతారామ్ (94) వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో శనివారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకుడు వి. శాంతారామ్ సతీమణి అయిన ఆమె ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’, ‘దో ఆంఖే బారా హాత్’, ‘నవరంగ్’, ‘పింజ్రా’ వంటి చిరస్మరణీయ చిత్రాల్లో తన నటన, నృత్య కౌశలంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముంబైలో అంత్యక్రియలు పూర్తయ్యాయి