పబ్లిక్ ప్లేస్‌లో క్రమశిక్షణ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్ శాఖ స్పష్టం చేసింది.
ఆక్రమణలపై ట్రాఫిక్ శాఖ చర్యలు: పెద్ద బజార్‌లో క్లీనప్ డ్రైవ్
🗓 జూన్ 25 నిజామాబాద్ – M4News
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో నగరం లో పోస్ట్ ఆఫీస్, పెద్ద బజార్, ఆజం రోడ్ పరిధిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలపై ట్రాఫిక్ శాఖ ఉక్కుపాదం మోపింది. ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మస్తాన్ అలీ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ నేతృత్వంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ చర్యలు టాప్ ట్రాఫిక్ నియంత్రణ చర్యల భాగంగా చేపట్టబడ్డాయి. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ:
“రోడ్డుకు ఇరువైపులా ఎక్కడా ఆక్రమణలు ఉపేక్షించం. గతంలోనే షాపు యజమానులను పిలిపించి సమావేశాలు నిర్వహించాం. అయినా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలి,” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
రహదారులను అడ్డుకునే వస్తువులను తొలగించడంతో ప్రజల రాకపోకలకు ఉపశమనం లభించనుంది.
పబ్లిక్ ప్లేస్‌లో క్రమశిక్షణ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్ శాఖ స్పష్టం చేసింది