శీర్షిక వినాయక చవితి
నలుగుపిండి నుండి పార్వతిఅమ్మ
ఊపిరి పోయగ అవతరించినావు
తల్లి మాటను శిరసావహించి
మహాదేవుడుని ఎదిరించినావు
పల్లె పట్నం జనులంద నిను కొనియాడుతూ
స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు
దివి నుండి బువికి రావయ్య ఓ గౌరీ తనయా
పూలు మామిడి తోరణాలతో అలంకరించి కుడుములు ఉండ్రాళ్లు నైవేద్యముగా పెట్టామయ్యా రావయ్య ఓ గణపయ్య
విఘ్నలకు అధిపతివి నీవయ్యా అవిఘ్నమనే ఆశేస్సుల నియ్యవయ్యా
భక్తి శ్రద్ధ లతో చేసిన పూజలు అందుకొని
పర్యావరణాన్ని పరిరక్షించుకునే బుద్ధి నియ్యవయ్య
తల్లిదండ్రుల కంటే మించిన పుణ్యక్షేత్రాలు ఏమీ
లేవు అని భావించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి
గణనాథుడవయినావు
కుంజరము వక్త్రము తెచ్చి పెట్టగ నీవు గజాననుడవయినావు
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఆదిపూజ్యుడికి అభివందనం
పార్వతీనందనుడికి ప్రియవందనం చేస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
రచన శ్రీమతి మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218