సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు…మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, క్యూలైన్ల నిర్వహణ, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, వలయ రహదారి, పాతాళ గంగ మొదలైన ప్రదేశాలను తరచుగా సి.సి. కెమెరాల ద్వారా ఈఓ శ్రీనివాస రావు పరిశీలిస్తుంటారు