తలంపుల తీపితనం –
మోహన్‌ను పరామర్శించిన టీచర్ ట్రైనీ మిత్రులు
ప్రతినిధి: మనోరంజని, తెలుగు టైమ్స్, ఆసిఫాబాద్ అక్టోబర్ 12
2008-09 సంవత్సరంలో టీచర్ ట్రైనింగ్ చేసిన నెర్రె మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అతని TTC (Teacher Training Course) బ్యాచ్ మిత్రులు, దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, బాన్సువాడ నియోజకవర్గం బొర్లం గ్రామానికి ఆదివారం వచ్చి మోహన్‌ను పరామర్శించారు. 16 ఏళ్ల తర్వాత మిత్రునితో సమావేశమవడం మధురానుభూతిని కలిగించింది. అందరూ కలిసి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడిపారు. మితృత్వం కేవలం భావోద్వేగానికి పరిమితం కాకుండా, మానవతా దృక్పథంతో 23,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మోహన్‌కు అందించడం ఈ సంఘటనను మరింత విశిష్టంగా నిలిపింది. మోహన్ కుటుంబ సభ్యులు ఈ ఆదరణకు హర్షం వ్యక్తం చేస్తూ, మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కథనం మానవ సంబంధాల్లో నమ్మకాన్ని, అనురాగాన్ని, సమాజంలో ఒకరికొకరు ఇచ్చే మద్దతు ఎంత విలువైనదో నిరూపిస్తుంది