రాష్ట్ర ప్రభుత్వం సొయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం

సోయాబీన్ పంట కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యం
  • ముధోల్ నియోజకవర్గంలో సొయా కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
  • దళారుల చేతికి అమ్మకాలు చేయడం వలన రైతులకు భారీ నష్టం
  • రైతులకు సాయపడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని రైతుల ఆవేదన

 

ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం, తానుర్, కుంటాల, బాసర సహా ఐదు మండలాల్లో సొయా కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు దళారుల చేతికి పంట అమ్ముకోవాల్సి వచ్చింది. క్వింటా ధర రూ.500-600 వరకు తక్కువగా రావడం వల్ల రైతులు సుమారు 30 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నారు.

 

ముధోల్ నియోజకవర్గంలో రైతులు ఎంతో కష్టపడి పండించిన సోయాబీన్ పంట కొనుగోలు కోసం నిరీక్షిస్తుండగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులను తీవ్ర ఆవేదనలో ముంచేసింది. లోకేశ్వరం, తానుర్, కుంటాల, బాసర సహా ఐదు మండల కేంద్రాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవు. పండుగ కాలంలో తమ పంటలు దళారుల చేతికి అమ్ముకోవడం వలన రైతులు దాదాపు 30 కోట్ల నష్టాన్ని చవిచూశారు.

వాటిలో సరైన ధర లేకపోవడంతో క్వింటాకు రూ.500-600 నష్టం ఎదురైంది. రైతుల నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. పాలకులు మారినా రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి మాత్రం మారలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment