సోయా కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలి

సోయా కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలి

సోయా కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలి

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 26

సోయా కొనుగోలు కేంద్రాన్ని రైతుల సౌకర్యార్థం అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ ముధోల్ కమిటీ ఆధ్వర్యంలో తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ ధాన్యం తూకం సమయంలో అవినీతి నిర్మూలన, కొనుగోలు చేసిన ధాన్యానికి సరియైన రసీదు ఇవ్వాలని కోరారు.
ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున సొయా పంట అమ్మకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తోటలకు వెళ్ళే దారుల మరమ్మత్తు, వ్యవసాయానికి పద్దెనిమిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రభుత్వం ద్వారా రైతుల కొరకు నిర్మితమైన గోదాం లను రైతుల ధాన్యం నిల్వ కొరకే వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు జంబుల సాయిప్రసాద్, ఉపాధ్యక్షుడు దిగంబర్ పటేల్, కార్యదర్శి బాసిన్ల సాయన్న, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment