మెరిసిన ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ కొడుకు.

మెరిసిన ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ కొడుకు.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 21

నిర్మల్ జిల్లా:- సాధించాలన్న తపన… అంగవైకల్యానికి అడ్డు రాదని, వైకల్యం కేవలం శరీరానికి మాత్రమేనని, చదువు కాదని కష్టపడి చదివి గ్రూప్ త్రీ పరీక్షలు సారంగాపూర్ మండలం కౌట్ల బి గ్రామానికి చెందిన అరుణ్ ఆడిటర్ గా ఉద్యోగం సాధించారు.
కౌట్ల బి గ్రామానికి చెందిన శ్రీ రామోజీ పద్మ భూమయ్య లకు ముగ్గురు సంతానం కాగా ఒక కుమార్తె ఇద్దరు కుమారులు.. భూమయ్య ప్రైవేటు స్కూల్ బస్ డ్రైవర్ గా, పద్మ బీడీలు చేస్తూ పిల్లలను చదివించారు.. చిన్న కుమారుడైన అరుణ్ కు ఒక కన్ను లేకపోయినా చదువుపై ఉన్న శ్రద్ధను చూసి డిగ్రీ వరకు చదివించారు.. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించే ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో పలువురు అభినందించారు. గ్రూప్ వన్ ఉద్యోగం లక్ష్యంగా ముందుకు కొనసాగుతానని ఈ సందర్భంగా అరుణ్ పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment