సదరం సమస్యల పరిష్కారం : స్పందన దివ్యాంగుల సంఘం హామీ

సదరం సమస్యల పరిష్కారం : స్పందన దివ్యాంగుల సంఘం హామీ

సదరం సమస్యల పరిష్కారం : స్పందన దివ్యాంగుల సంఘం హామీ
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ – సెప్టెంబర్ 19

నిర్మల్ జిల్లా దివ్యాంగుల సదరం సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్పందన దివ్యాంగుల నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ, ప్రధాన కార్యదర్శి సాక్ పెళ్లి సురేందర్ హామీ ఇచ్చారు. శుక్రవారం బైంసా మార్కెట్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సదరం క్యాంప్‌కు వచ్చే దివ్యాంగులు తమ వెంట ఆసుపత్రి రిపోర్టులు తీసుకురావాలని, వినికిడి లోపం ఉన్న వారు హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిపోర్టులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. సదరం సర్టిఫికేట్ ఉన్నా, యూనిక్ డిజేబుల్డ్ కార్డు లేని వారు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంఘం తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మండల అధ్యక్షులు పుప్పాల పిరజీ, వికలాంగుల సాక్షం జిల్లా అధ్యక్షులు పంచాగుడి మహేష్ సహా పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment