సర్వేయర్ ఇన్స్పెక్టర్ (ఏ.డి) శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం

సర్వేయర్ ఇన్స్పెక్టర్ (ఏ.డి) శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం

సర్వేయర్ ఇన్స్పెక్టర్ (ఏ.డి) శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం
— మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్, మెదక్ – నవంబర్ 29

మెదక్ జిల్లాలో సర్వేయర్ ఇన్స్పెక్టర్ (ఏ.డి) గా పనిచేస్తున్న శ్రీనివాస్ శనివారం పదవీవిరమణ పొందారు. ఈ సందర్భంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “గతంలో కామారెడ్డి జిల్లాలో ఏడు సంవత్సరాలపాటు ప్రజాసేవలో అనన్యసామాన్యమైన కృషి చేసిన అధికారి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమైనవి. మెదక్ బదిలీపై వచ్చి ఇక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు” అని అభినందించారు. పదవీవిరమణ సందర్భంగా శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులకు శాలువాతో ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment