- హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం లో కొనుగోలుదార్ల లోపం
- రేట్లు తగ్గించినా, కొనుగోలుదార్లు తక్కువ
- బిల్డర్లు ఆర్థిక ఒత్తిడిలో
హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర కష్టాల్లో ఉంది. గత ఆరు నెలలుగా రియల్ ఎస్టేట్ విభాగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులు పూర్తవుతున్నప్పటికీ, కొనుగోలుదార్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ధరలు తగ్గించినా కొనుగోలు సడలించకపోవడంతో, బిల్డర్లు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గత ఆరు నెలలుగా కుదేలవుతూ, కొనుగోలుదార్ల కొరతతో రియేటర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్, కర్మాంఘాట్, వనస్థలిపురం, హయత్‌నగర్, నాగోల్ వంటి ప్రాంతాలలో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పుడే పూర్తికావడం జరిగిందని, అయితే కొనుగోలుదారులు కొరతతో ఫ్లాట్లు అమ్మకం జరగడం లేదు.
ఈ పరిణామాల మధ్య, గతంలో ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో స్క్వేర్ ఫీట్ ధర 6000 నుంచి 7200 రూపాయలు ఉండగా, ఇప్పుడు 5000 రూపాయలకు తగ్గించినా కొనుగోలుదార్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ల్యాండ్ షేర్ హోల్డర్లు, బిల్డర్లు అందుబాటు ధరలకు సైతం ఫ్లాట్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదార్ల సందేహాల కారణంగా అమ్మకాలు సక్రమంగా జరగడం లేదు.
రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి గణనీయ మార్పు కొనసాగుతుందని, రాబోయే కాలంలో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడులు రాబడే స్థాయిలో లేకపోవడంతో, నిర్మాణకర్తలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని స్పష్టమవుతోంది.
.