రాజన్న ఆలయం బంద్ కాలేదు : విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం

రాజన్న ఆలయం బంద్ కాలేదు : విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం

రాజన్న ఆలయం బంద్ కాలేదు : విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం

తాత్కాలికంగా భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు

మనోరంజని తెలుగు టైమ్స్ – వేములవాడ, అక్టోబర్ 12

దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం బంద్ కాలేదని, ఆలయ విస్తరణ పనుల కారణంగా కేవలం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న ఆలయ గెస్ట్ హౌస్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇందులో భాగంగా 47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలు, శాస్త్ర ప్రకారం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు, దర్శనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ₹3.40 కోట్లతో సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.

“రాజన్న ఆలయంలో సుమారు 64–70 పిల్లర్లతో మండపాల నిర్మాణం జరుగుతుంది. భారీ యంత్రాలతో పనులు చేయాల్సి ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా తాత్కాలిక మార్పులు చేశారు” అని చెప్పారు.

ఆలయ అభివృద్ధి ఒక్కడి ఏజెండా కాదని, ఇది రాజన్న భక్తుల అభిలాష అని అన్నారు. “100 సంవత్సరాల పాటు భక్తులు సౌకర్యంగా దర్శనాలు చేయగల విధంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇల్లు కట్టేటప్పుడు తాత్కాలికంగా బయట ఉంటాం కదా, అదే తరహాలో ఇది కూడా” అని ఉదాహరణ ఇచ్చారు.

“రాజన్న ఆలయం బంద్ అయిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. స్వామివారికి నిత్య పూజలు, నైవేద్యాలు ఏకాంతంగా కొనసాగుతాయి. భక్తుల కోసం మాత్రం భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశాం” అని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment