మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మాలలకు కేటాయించాలి

మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మాలలకు కేటాయించాలి

ఎమ్4 ప్రతినిధి ముధోల్ 

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సి మాలలకు కేటాయించాలని కుభీర్ మండల మాలల ఐక్య వేదిక -ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాలులు గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అండ దండలు గా ఉంటూ పార్టీ విజయం లో కీలక పాత్ర పోషించారు. కుభీర్ మండల వ్యాప్తంగా 41గ్రామపంచయతీలకు గానూ 33 గ్రామాలలో ఎస్సీ మాల సామాజిక వర్గం అత్యధికంగా ఉందని అన్నారు. గత ఎన్నిలలో మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడది. మా న్యాయపరమైన డిమాండ్ పై ముదోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు స్పందించి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సీతక్కకి పీసీసీ అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ పదవిని మాలలకే కేటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు అందోళనలు చేపట్టాతమని హెచ్చరించారు. రాబోయే ఎమ్మెల్సీ – స్థానిక ఎన్నికలలో మాలల సత్తా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గౌరవ అధ్యక్షులు జంగ్మె చంద్రాo అధ్యక్షులు దుగ్గె సందీప్, జాయింట్ సెక్రటరీ ఏడ్కే రాహుల్, ఉమ్మేడే భూషణ్, కస్తూరి రాహుల్, జంగ్మె దయానంద్, గడ్పాలే రాజు, దేవుకే అమోల్, గడ్పాలే ధమ్మపాల్, యేడ్క్ కబీర్, కోత్మీరే చంద్రం, గడ్ఫాలే గంగాధర్, బ్యాన్సోడే భీమ్రావు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment