నాసిరకం పని వల్లే చెరువు అలుగు కోతకు గురై కూలింది
జనత న్యూస్ ఏప్రిల్ 25 కుంటాల: కుంటాల మండలంలోని వెంకూరు గ్రామ శివారులో 2006 సంవత్సరం లో చెరువు పూర్తయి చెరువు అలుగు నాసిరకంగా నిర్మించడం వల్లే కోతకు గురై కూలిందని స్థానిక గ్రామస్తులంటున్నారు. అప్పటి సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతి వర్షాకాలం వేసిన పంటలు అధిక వర్షాలకు నీటి ప్రవాహాన్ని కొట్టుకపోయి తీవ్రంగా నష్టపోతున్నామని పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సర్వేలు చేస్తున్నారు పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చెరువు కట్ట దివనున్న రైతన్నలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెరువులు మరమ్మత్తులు చేసి రైతుల భూములు నష్టపోకుండా నీటి ప్రవాహానికి కోతకు గురి కాకుండా కట్టను నిర్మించాలని రైతన్నలు కోరుతున్నారు