ఇల్లు కాలిన పేద కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు – రెహమాన్ ఫౌండేషన్ ఆపన్నహస్తం అందజేత!

ఇల్లు కాలిన పేద కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు – రెహమాన్ ఫౌండేషన్ ఆపన్నహస్తం అందజేత!

ఇల్లు కాలిన పేద కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు – రెహమాన్ ఫౌండేషన్ ఆపన్నహస్తం అందజేత!

నిందితుడిపై కఠిన చర్యలు తప్పవు – ఎస్‌.ఐ. గంగన్న

బాధితురాలికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి – డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ

మనోరంజని తెలుగు టైమ్స్ లింగాపూర్: ప్రతినిది అక్టోబర్ 18

లింగాపూర్ మండలంలోని ఎల్లాపాటర్ గ్రామంలో భార్యపై కోపంతో ముజాయిజ్ బెగ్ అత్తింటికి నిప్పు పెట్టడంతో బాధితురాలు షమాబి కుటుంబం నిర్భంద స్థితికి చేరింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎస్‌.ఐ. సి.హెచ్. గంగన్న రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ₹10,000 విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు.
లింగాపూర్ ఎస్‌.ఐ. గంగన్న మాట్లాడుతూ…..,* “బాధిత కుటుంబానికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని స్పష్టం చేశారు. డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ మాట్లాడుతూ…., “మానవతా సేవ మన ధర్మం. ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితురాలికి సహాయం చేయాలి,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ పోలీస్ సిబ్బంది, రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు, సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్థానికులు పోలీసుల సేవా హృదయాన్ని, ఫౌండేషన్ మానవతా దృక్పథాన్ని అభినందించారు._

Join WhatsApp

Join Now

Leave a Comment