పెద్దమ్మతల్లి ఆలయాన్ని పున: నిర్మించాలి
బిజెపి నాయకుడు లడ్డు పోతన్న
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 2
హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పున నిర్మించాలని ముధోల్ మండల బిజెపి నాయకుడు లడ్డు పోతన్న అన్నారు. ముధోల్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ హైదరబాద్ పట్టణంలోని బంజారా హిల్స్ లోపెద్దమ్మ తల్లి ఆలయాన్ని హైడ్రా అధికారులు అక్రమంగా కూల్చివేయడంతో హిందూ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఆలయాన్ని కూల్చి వేయడంతో యావత్ తెలంగాణ హిందూ సమాజం తీవ్రంగా ఖండించిందన్నారు. కూల్చి వేసిన పెద్దమ్మతల్లి ఆలయాన్ని 1000 గజాల స్థలంలో ప్రభుత్వం గుడిని పున నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. సమస్యను పరిష్కరించని యెడల బిజెపి ఆధ్వర్యంలో ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు