ఈనెల 14న జరుగు  జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

ఈనెల 14న జరుగు  జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 14న జరుగు  జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
 
 రాజీమార్గం రాజమార్గం
 
కొట్టుకుంటే ఒకరే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు 
 
— జిల్లా ఎస్పి డా.జి. జానకి షర్మిల ఐపిఎస్..
 
మనోరంజని : ( ప్రతినిధి )
 
నిర్మల్ : డిసెంబర్ 12
 
 
చాలా కాలంగా కోర్టులో పెండిరగ్‌లో వున్న కేసు పరిష్కారం కోసం జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.  డిసెంబర్‌ 14వ తేదిన అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించబడును. ఈ లోక్‌ అదాలత్‌ ద్వారా చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినల్‌ కేసులతో పాటు రాజీపడదగిన సివిల్‌ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్‌ఫండ్‌ కేసులు, చెక్‌బౌన్స్‌కేసులు, వైవాహిక కేసులు, తగాదాలు, అన్ని రకాల ట్రాఫిక్‌ కేసులకు సంబంధించి జాతీయ లోక్‌ అదాలత్‌నందు ఇరువర్గాల కక్షీదారులు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం ఈ లోక్‌ అదాలత్‌ ద్వారా పొందవచ్చని. ఇరువర్గాల కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను సద్వినియోగించుకోని సమస్యలను పరిష్కరించుకోవాలని.  
 
రాజీ మార్గం  రాజ మార్గమని చిన్న చిన్న  కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారికి సమాచారం ఇచ్చి రాజీ కి అవకాశం కల్పిస్తారని సూచించారు.
మరిన్ని వివరాలను కొసం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను సంప్రదించాల్సిందిగా ఎస్పి తెలియజేసారు

Join WhatsApp

Join Now

Leave a Comment