అంగన్వాడి కేంద్రం తనిఖీ చేసిన పంచాయతీకార్యదర్శి
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 22
ముధోల్:మండల కేంద్రంలోని కసాబ్ గల్లి పదవ అంగన్వాడి కేంద్రాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి ఆన్వ ర్ ఆలీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగ న్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలకు గుడ్లను అందించాలన్నారు. ప్రతిరోజు పౌష్టిక ఆహారం అందించే వివరాలను అంగన్వాడి టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రాలకు వచ్చే విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులను నేర్పించాలని పేర్కొన్నారు. గర్భిణీలకు, బాలింతలకు పోష కాహారం అందించేందుకు కృషి చేయాలని అన్నారు