బైంసాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు
వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ -ఎమ్మెల్యే
బందోబస్తును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల
భైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 4
భైంసా పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర కొనసాగుతుంది. తొమ్మిది రోజులపాటు వివిధ గణేష్ మండలీల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి ఉదయం సాయంత్రం సమయాల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విగ్నేశ్వరుడిని ప్రతిష్టించారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ -ఎమ్మెల్యే రామారావు పటేల్ -ఉత్సవ సమితి సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జోత్సవ శోభాయాత్ర వెళ్లే మార్గంలో నాలుగు డ్రోన్లు, 120 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 600 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రను పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అల్పాహారం పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనోత్సవం పురస్కరించుకొని గజ ఈతగాలను అందుబాటులోకి ఉంచారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటును చేసింది. యువకులు, చిన్నారులు శోభాయాత్రలో చేస్తున్న నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.