వ్యాధి గురించి తెలిస్తే పరువు పోతుందని తమ్ముడిని చంపేసిన అక్క
కర్ణాటకలో చిత్రదుర్గం జిల్లా దుమ్మి గ్రామంలో నయంకాని వ్యాధి ఉందని తెలిస్తే పరువు పోతుందని భావించిన అక్క తమ్ముడిని చంపేసింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మల్లికార్జున్ సొంతూరుకు వస్తుండగా యాక్సిండ్ అయ్యింది. చికిత్సకై దావణగెరె ఆసుపత్రిలో చేరగా, వైద్యులు నయంకాని వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. దీంతో కుటంబం పరువుపోతుందని భావించి, తమ్ముడిని భర్త మంజునాథ్‌తో కలిసి వాహనంలోనే గొంతుకు టవల్ బిగించి హత్య చేసింది. మృతదేహాన్ని ఊరుకి తీసుకొచ్చి ప్రమాదంలో చనిపోయినట్టు చెప్పింది. తండ్రి అనుమానంతో నిజం బయటపడింది