హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. 33 జిల్లాల్లో 12,769 గ్రామాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పంచాయతీల, వార్డుల ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రదర్శిస్తోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,67,33,585 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 13న విడుదలై, అభ్యంతరాల పరిష్కారంతో తుది జాబితా సిద్ధమైంది.
- పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభం
- కోటి 67 లక్షల 33 వేల 585 మంది ఓటర్లు
- 58,562 బ్యాలెట్ బాక్సులు సిద్ధం
- రిజర్వేషన్ల ప్రక్రియపై ఉత్కంఠ
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు చేస్తోంది. ఫైనల్ ఓటర్ జాబితాలో మొత్తం 1,67,33,585 మంది ఉన్నారు. ఈ ఎన్నికలకు 58,562 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఓటర్ల వివరాలు ప్రదర్శించబడ్డాయి.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 1,67,33,585 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇప్పటి వరకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలై, అభ్యంతరాలు స్వీకరించగా, తుది జాబితా విడుదలకు సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల సరఫరా పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 58,562 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వెళ్లనుంది.