మాదాపూర్ సర్పంచ్‌గా ఎన్నికైన ఇమ్రాన్‌కు ముస్లిం ఏక్తా సంఘం ఘన సన్మానం
అదిలాబాద్ జిల్లా, డిసెంబర్ 23 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
అదిలాబాద్ జిల్లాలోని మాదాపూర్ గ్రామానికి సర్పంచ్‌గా తెలంగాణ ముస్లిం ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ ఎన్నికైన సందర్భంగా, ఆ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు షేక్ ముజాహిద్ మాట్లాడుతూ — “మా సొసైటీ సభ్యుడు ఇమ్రాన్ ప్రజా సేవలోకి అడుగుపెట్టడం గర్వకారణం. ఆయన సర్పంచ్‌గా ఎన్నిక కావడం సొసైటీకి గౌరవంగా నిలిచింది. భవిష్యత్తులో మా సొసైటీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్లుగా కూడా ప్రతినిధులు రావాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
సన్మాన కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సాజీద్, ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్, అప్రోచ్ పాషా ఖాన్, మొయిజ్, ఫజిల్ హాష్మి తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజా సేవలో కొత్త దశను ప్రారంభించిన సర్పంచ్ ఇమ్రాన్‌కు సంఘ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.