క్రికెట్ టోర్నీ విజేతగా మార్నింగ్ క్లబ్ జట్టు

క్రికెట్ టోర్నీ విజేతగా మార్నింగ్ క్లబ్ జట్టు

క్రికెట్ టోర్నీ విజేతగా మార్నింగ్ క్లబ్ జట్టు

మనోరంజని ( ప్రతినిధి )

ముధోల్ : జనవరి 19

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గత వారం రోజుల నుండి ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ విజేతగా మార్నింగ్ క్లబ్ జట్టు నిలిచింది.

మొదటి బహుమతిగా మార్నింగ్ క్లబ్ టీంకు రూ.11111లు నగదు బహుమతితో పాటు షీల్డ్ ను అందించారు అదేవిధంగా ద్వితీయ బహుమతి చైతన్య టీం దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. గెలుపు సాధించేందుకు జట్టు సభ్యులు తలపడిన తీరు క్రీడా ప్రేమికులను విశేషంగా అకట్టుకుంది. క్రికెట్ టోర్నీ విజేతగా నిలిచిన మార్నింగ్ టీం తో పాటు ఉప-విజేయ చైతన్య టీంకు స్థానిక ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. వారం రోజులపాటు ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మాజీ ఎంపీపీలు అఫ్రోజ్ ఖాన్, ఎజాజ్ ఉద్దీన్, తాజా మాజీ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్, కో- ఆప్షన్ సభ్యులు మాక్ధూమ్, మాజీ ఎంపీటీసీలు దేవోజీ భూమేష్, శ్రీనివాస్ గౌడ్, ప్రింట్ -ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఉప సర్పంచ్లు మోహన్ యాదవ్, గడ్డం సుభాష్, జంబుల సాయిప్రసాద్, వీడిసి అధ్యక్షుడు గుంజలోళ్ల నారాయణ కార్యదర్శి మెత్రి సాయినాథ్, వసిం, నాయకులు తాటేవార్ రమేష్, షమీం, కిషోర్ మేస్త్రి, పోతన్న, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment