బంధువులు లేని మృతదేహానికి దైవసేవగా అంత్యక్రియలు చేసిన మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్
మానవత్వానికి ప్రతీకగా ఫౌండేషన్ సేవలు
జమ్మలమడుగులో రఘు వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వర్తించిన సభ్యులు
జమ్మలమడుగులో బిక్షాటన చేస్తూ అనారోగ్యంతో మరణించిన రఘు అనే వ్యక్తికి బంధువులు లేకపోవడంతో, పోలీసుల విజ్ఞప్తికి స్పందించిన మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ మరియు సభ్యులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు.
జమ్మలమడుగు పట్టణంలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న రఘు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, అతనికి బంధువులు ఎవరూ లేని పరిస్థితిలో స్థానిక పోలీసులు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌ను సంప్రదించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ సభ్యులు స్పందించి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు హిందూ స్మశానవాటికలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, అహమ్మద్ హుస్సేన్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, సురేష్, ప్రసన్న కుమార్ తదితరులు సహకరించారు.
మానవతా సేవలో భాగంగా ఫౌండేషన్ సభ్యులు “బంధువులు లేని వారిని కూడా మానవతా హక్కులతో వీడ్కోలు ఇవ్వడం మన ధర్మం” అన్నారు.
వృద్ధులు లేదా నిరాశ్రయులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించవచ్చని ఫౌండేషన్ తెలిపింది.