వైద్య వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి:*
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ అక్టోబర్ 28
జిల్లాలో వైద్య వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైద్య వ్యర్థాల నిర్వహణపై (బయో మెడికల్ వేస్టేజీ మేనేజ్మెంట్) అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, పశు ఆసుపత్రులు, వైద్య శిబిరాల్లో నుంచి నిరంతరం వైద్య వ్యర్థాల సేకరించి, ప్రభుత్వం నిర్ధారించిన శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించి, నిర్వీర్యం చేయాలని అన్నారు. ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా వైద్య వ్యర్థాలు సేకరించాలన్నారు. వైద్య వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా బయట పారివేయరాదని అన్నారు. ఇలా చేస్తే పర్యావరణానికి ఎంతో ప్రమాదం కలుగుతుందని చెప్పారు. ఇందుకు గాను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ అనుమతులు కలిగి ఉండాలని వివరించారు. అనుమతుల గడువులు ముగిస్తే ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలని తెలిపారు. అనుమతులు లేని, రెన్యువల్ చేసుకొని ఆసుపత్రులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.